Life of Ram🙏
రామ నామమును జపించి జ్వలించు
రామ పాదమును స్పృశించి తరించు
||2||
చైత్ర శుద్ధ నవమిన జన్మించెను
తాటకాంతమును సఫలముజేసెను
స్వయంవరమున ధనస్సు విరిచెను
సీతాపతియై విరాజిల్లెను
||రామ||
పితృ వాక్యమును పరిపాలించెను
రాజ్యమునంతయు పరిత్యజించెను
వనవాసమున మారీచుని చంపెను
వాలిప్రమథనుడై ప్రకాశించెను
||రామ||
సీతను వెదకుచు వారథి కట్టెను
లంకేశ్వరుని సంహరించెను
వైదేహినిగూడి అయోధ్య చేరెను
హనుమదశ్రితుడై దరిశనమిచ్చెను
||రామ||
Comments
Post a Comment