Posts

Showing posts from October, 2022

అమ్మ

నా పెదవులకు మాటలు నేర్పింది నువ్వే నా మాటలకు మురిసిపోయిందీ నువ్వే  నా పాదాలకు నడక నేర్పింది నువ్వే  నా బుడి బుడి అడుగులకు అబ్బురపోయిందీ నువ్వే  నాకు లాలి పాడింది నువ్వే  నా పాటకు చప్పట్లు కొట్టిందీ నువ్వే  నాకు అక్షరాలు దిద్దించింది నువ్వే  నా ఉన్నతికి గర్వపడిందీ నువ్వే నా పై చిరు కోపం చూపేది నువ్వే  నాకు కొండంత ప్రేమను అందించేదీ నువ్వే నాకు ధైర్యం చెప్పేది నువ్వే  నాకోసం ధైర్యం చేసేదీ నువ్వే నా పై అలిగేది నువ్వే  నా అలకను తీర్చేదీ నువ్వే నా బాధను పంచుకునేది నువ్వే  నీ బాధను గుండెల్లో దాచుకునేదీ నువ్వే  నాకు ప్రపంచాన్ని పరిచయం చేసింది నువ్వే  నాకోసం ప్రపంచం తో పోరాడేదీ నువ్వే నాకు కష్టాలను ఎదురుకునే శక్తిని ఇచ్చింది నువ్వే  నాకు చిన్న కష్టమొచ్చినా కన్నీరు కార్చేదీ నువ్వే నాకు జన్మనిచ్చింది నువ్వే నీకంటూ ఒక జీవితముందని మరచిపోయిందీ నువ్వే ~ శ్రీలేఖ పబ్బిశెట్టి