అమ్మ


నా పెదవులకు మాటలు నేర్పింది నువ్వే

నా మాటలకు మురిసిపోయిందీ నువ్వే 

నా పాదాలకు నడక నేర్పింది నువ్వే 

నా బుడి బుడి అడుగులకు అబ్బురపోయిందీ నువ్వే 

నాకు లాలి పాడింది నువ్వే 

నా పాటకు చప్పట్లు కొట్టిందీ నువ్వే 

నాకు అక్షరాలు దిద్దించింది నువ్వే 

నా ఉన్నతికి గర్వపడిందీ నువ్వే

నా పై చిరు కోపం చూపేది నువ్వే 

నాకు కొండంత ప్రేమను అందించేదీ నువ్వే

నాకు ధైర్యం చెప్పేది నువ్వే 

నాకోసం ధైర్యం చేసేదీ నువ్వే

నా పై అలిగేది నువ్వే 

నా అలకను తీర్చేదీ నువ్వే

నా బాధను పంచుకునేది నువ్వే 

నీ బాధను గుండెల్లో దాచుకునేదీ నువ్వే 

నాకు ప్రపంచాన్ని పరిచయం చేసింది నువ్వే 

నాకోసం ప్రపంచం తో పోరాడేదీ నువ్వే

నాకు కష్టాలను ఎదురుకునే శక్తిని ఇచ్చింది నువ్వే 

నాకు చిన్న కష్టమొచ్చినా కన్నీరు కార్చేదీ నువ్వే

నాకు జన్మనిచ్చింది నువ్వే

నీకంటూ ఒక జీవితముందని మరచిపోయిందీ నువ్వే

~శ్రీలేఖ పబ్బిశెట్టి

Comments

Popular posts from this blog

BEAUTY OR DUTY

PAUSE IT IVITY(+ve)